![]() |
![]() |

‘బబుల్ గమ్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రోషన్ కనకాల. తల్లీతండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా 29న రిలీజ్ కాబోతోంది. మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మూవీ టీమ్ ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి పలు ఆసక్తికర విషయాలు వివరించాడు. చిన్నప్పటి నుంచే తనకు నటన పట్ల ఆసక్తి ఉందని చెప్పాడు రోషన్ కనకాల. చిన్నప్పుడు అమ్మతో కలిసి ఓ యాడ్ లో నటించడం సంతోషంగా అనిపించిందన్నారు.
అప్పుడే నటుడిని కావాలనే కోరిక కలిగిందని చెప్పుకొచ్చాడు. “చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. ఓసారి అమ్మతో కలిసి సర్ఫ్ ఎక్సెల్ యాడ్ లో నటించాను. చాలా సంతోషం కలిగింది. స్టూడెంట్ నంబర్ 1 మూవీ ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. అప్పుడే యాక్టింగ్ సైడ్ రావాలని ఇంటరెస్ట్ కలిగింది. ఆ కోరికతోనే యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాను. తర్వాత ‘ఒక మనసు’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను. తర్వాత ‘నిర్మలా కాన్వెంట్’లోనూ ఒక రోల్ చేసాను. ఇప్పుడు ‘బబుల్ గమ్’ మూవీతో హీరోగా వస్తున్నాను” అని చెప్పాడు. అలాగే రాజీవ్ కనకాల, సుమ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలపైనా రోషన్ స్పందించాడు. అవన్నీ కేవలం పుకార్లుగా కొట్టి పారేశారు.
“అమ్మానాన్న డివోర్స్ తీసుకుంటున్నట్లు వార్తలు సెల్ లో కనిపించింది అవి నేను చదువుతున్నా. అదే టైంలో నా ముందే అమ్మా నాన్న కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ న్యూస్ చదువుతూ అమ్మానాన్న నవ్వుకున్నారు. విడాకుల విషయం గురించి ముందుగా ఇంట్లో వాళ్లకు తెలీకుండా మీడియాకి ఎలా తెలిసిందా అనుకున్నా.. ఇక మూవీ విషయానికి వస్తే బబుల్ గం లో ఇజ్జత్ అనే సాంగ్ ని పాడాను నేను." అని చెప్పాడు రోషన్.
![]() |
![]() |